

శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ చిత్రానికి తెలుగు థియేట్రికల్, ఓవరాల్ థియేట్రికల్ మార్కెట్ వాల్యూ కలిపి రూ. 100 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కథలను ఎంచుకుంటున్న నాని మార్కెట్ టైర్ 2 స్థాయి నుంచి టైర్ 1కు సమానమైన స్థాయికి చేరిందనే అంచనాలు ఉన్నాయి. ‘దసరా’తో వచ్చిన గ్లోబల్ క్రేజ్, శ్రీకాంత్ ఓదెల మాస్ ఎమోషనల్ మేకింగ్ వ్యాపారానికి కారణాలుగా చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ పంపిణీదారులు నైజాం హక్కులను భారీ ధరకు దక్కించుకోవడం కీలకంగా మారింది.
అయితే రూ. 100 కోట్లకు పైగా జరిగిన ఈ వ్యాపారాన్ని ‘ది ప్యారడైజ్’ ఎంతవరకు రికవరీ చేస్తుందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. సినిమా ఓపెనింగ్ డేకు స్పందన వచ్చే అవకాశం ఉందనే టాక్ ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో రన్నింగ్ కొనసాగితేనే పెట్టుబడిని అందుకోవడం సాధ్యమవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ ధరకు కొనుగోలు చేయడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమేననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రేక్షకుల స్పందన, వసూళ్ల వేగం, థియేటర్లలో కొనసాగింపు వంటి అంశాలపై రికవరీ ఆధారపడి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!