

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరియు తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ ఇచ్చిన సమాధానాలు ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి.
తాము కలిసి నటించిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమా ప్రమోషన్లలో ఈషా రెబ్బాను ఆమె డేటింగ్ రూమర్స్ గురించి అడిగారు. అందుకు ఆమె “ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! ప్రస్తుతం దేనిపైనా క్లారిటీ ఇవ్వలేను. నా జీవితంలో ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేనే చెబుతాను” అని చెప్పింది. దీంతో ఆమె సమాధానం పుకార్లను ఖండించకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో “ఆమె నాకు స్నేహితురాలికంటే ఎక్కువ” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఇది నా వ్యక్తిగత విషయం. కానీ త్వరలోనే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెబుతాను” అని హింట్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నిజమేననే భావన నెటిజన్లలో బలపడింది.
ఈ జంట నటించిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమా మలయాళ హిట్ జయ జయ జయ జయ హే రీమేక్‌గా ఈ నెల 30 న విడుదల కానుంది. తెరపై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తరుణ్ చెప్పిన ‘గుడ్ న్యూస్’ పెళ్లి గురించేనా? లేక కొత్త సినిమా గురించా? అనేది చూడాలి!










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!