

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని తన సినీ కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. ‘విక్రమ్’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాగ్, విభిన్న పాత్రలు మరియు ప్రత్యేక నటనతో అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన 100వ చిత్రాన్ని పూర్తి చేయబోతుండటం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. నాగార్జున ఇమేజ్‌కు తగ్గట్టుగా, అభిమానులను అలరించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగార్జున పక్కన నటించే హీరోయిన్గా సీనియర్ నటి, బాలీవుడ్ స్టార్ టబూ పేరు వినిపిస్తోంది. నాగ్‌కు ఇష్టమైన హీరోయిన్ అయిన టబూ, మరోసారి ఆయనతో కలిసి నటిస్తే అభిమానులకు అది పెద్ద సర్ప్రైజ్ అవుతుందని చెప్పాలి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇది రూమర్‌గానే కొనసాగుతోంది.
నాగార్జున, టబూ కలిసి నటించి దాదాపు 28 ఏళ్లు గడిచాయి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రంలో వారు చివరిసారిగా జంటగా కనిపించారు. అలాగే ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాలో వారి కెమిస్ట్రీ ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరేట్. ఇంత పెద్ద గ్యాప్ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తే అది సినీ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న డ్రామా అయోతీ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!