
క్రీడలు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా ‘కరుప్పు’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సూర్య అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, సూర్య తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు పా రంజిత్ చెప్పిన కథ సూర్యకు నచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై హీరో కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!