

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీకి సంబంధించి ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక చర్య తీసుకుంది. బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రాంగణం నుంచి సేకరించిన తాగునీటి నమూనాలో బ్రోమేట్ పరిమాణం నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా లేదని పరీక్షల్లో తేలింది. దీంతో ఆ నమూనాను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం అసురక్షితమైనదిగా ప్రకటించినట్లు FSSAI వెల్లడించింది.
ఈ ఫలితాలపై కంపెనీ అప్పీల్ చేయడంతో నమూనాను రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపి మరోసారి పరీక్షించారు. ఆ పరీక్షల్లోనూ పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించడంతో ఆ నమూనాను అసురక్షితమైనదిగా నిర్ధారించారు. PAHలలోని కొన్ని రసాయన సమ్మేళనాలు క్యాన్సర్ కారకాలుగా గుర్తింపు పొందాయి. ఈ ప్రయోగశాల నివేదికల ఆధారంగా బిస్లరీ ఇంటర్నేషనల్‌పై ఆహార భద్రత చట్టం కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు FSSAI అనుమతి ఇచ్చింది. అయితే, ఈ చర్య పరీక్షించిన నిర్దిష్ట నమూనాకు సంబంధించినదే తప్ప.. బిస్లరీకి చెందిన అన్ని ఉత్పత్తులు లేదా బ్యాచ్‌లకు వర్తిస్తుందని భావించకూడదు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!