22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..

Writer: Chandrika 11:38 PM, 22 నవంబర్, 2026
శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం కేరళ ఆరోగ్య శాఖ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. కొండ ఎక్కే సమయంలో అధిక శ్రమకు గురికాకుండా, వైద్యుల సూచనలు పాటించాలని కోరింది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు యాత్ర ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకుని, డాక్టర్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాలని సూచించింది. ఇటీవల గుండెపోటుకు గురైనవారు, గుండె శస్త్రచికిత్స లేదా యాంజియోప్లాస్టీ చేయించుకున్నవారు నిపుణుల సలహా లేకుండా యాత్రకు రావద్దని స్పష్టం చేసింది. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా వాడే మందులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ను వెంట తీసుకెళ్లాలని తెలిపింది.

కొండ మెట్లు ఎక్కేటప్పుడు తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా నెమ్మదిగా నడవాలని, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ తగినంత నీరు తాగాలని సూచించింది. ఖాళీ కడుపుతో కొండ ఎక్కవద్దని, తోపులాటలు, పరుగులు చేయవద్దని హెచ్చరించింది. ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అధిక చెమట, కళ్లు తిరగడం, గుండె కొట్టుకోవడంలో అసాధారణ మార్పులు లేదా తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నడక ఆపి వైద్య సహాయం పొందాలని తెలిపింది. నొప్పి చేతులు, దవడ లేదా వీపుకు వ్యాపించినా అప్రమత్తం కావాలని పేర్కొంది. అవసరమైతే సమీపంలోని అత్యవసర వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని, అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని కోరింది. అత్యవసర సహాయం కోసం 04735 203232 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపింది. నవంబర్ 17న ప్రారంభమైన మండల పూజ సీజన్ డిసెంబర్ 27 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 30న మకరవిలక్కు యాత్ర కోసం ఆలయం తిరిగి తెరుచుకోనుండగా, జనవరి 14న మకరవిలక్కు పండుగ నిర్వహిస్తారు. జనవరి 19 వరకు దర్శనాలు కొనసాగి, జనవరి 20న ఆలయం మూసివేస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిస్లరీ నీటి నమూనా అసురక్షితమని FSSAI ప్రకటన..

బిస్లరీ నీటి నమూనా అసురక్షితమని FSSAI ప్రకటన..

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం..

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం..

అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి

అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి

వెంటిలేటర్‌పై BJP ఎమ్మెల్యే రేఖా పాత్రా..

వెంటిలేటర్‌పై BJP ఎమ్మెల్యే రేఖా పాత్రా..

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..

ట్యాగ్లు
శబరిమలకేరళ ఆరోగ్య శాఖఅయ్యప్ప భక్తులుశబరిమల యాత్రగుండె ఆరోగ్యంకార్డియాక్ భద్రతఆరోగ్య మార్గదర్శకాలుమండల పూజమకరవిలక్కుభక్తుల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అట్లాంటా ఎయిర్‌పోర్టులో డెల్టా విమానాలకు అంతరాయం..
జనరల్

అట్లాంటా ఎయిర్‌పోర్టులో డెల్టా విమానాలకు అంతరాయం..

సారా టెండూల్కర్, రాజ్‌వీర్ డియోల్ పెళ్లి వార్తలపై జోరుగా ప్రచారం.. నిజమెంత?
గాసిప్స్

సారా టెండూల్కర్, రాజ్‌వీర్ డియోల్ పెళ్లి వార్తలపై జోరుగా ప్రచారం.. నిజమెంత?

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..
జనరల్

శబరిమల అయ్యప్ప భక్తులకు కేరళ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..

బిస్లరీ నీటి నమూనా అసురక్షితమని FSSAI ప్రకటన..
జనరల్

బిస్లరీ నీటి నమూనా అసురక్షితమని FSSAI ప్రకటన..

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం..

అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి
జనరల్

అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి

వెంటిలేటర్‌పై BJP ఎమ్మెల్యే రేఖా పాత్రా..
జనరల్

వెంటిలేటర్‌పై BJP ఎమ్మెల్యే రేఖా పాత్రా..

‘భోగి’ ట్రైలర్‌లో మాస్ అవతారంలో శర్వానంద్..
సినిమాలు

‘భోగి’ ట్రైలర్‌లో మాస్ అవతారంలో శర్వానంద్..

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..
రాజకీయాలు

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..
జనరల్

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!