

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ విజయంతో ఊరట పొందిన నేపథ్యంలో తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయతో ఆయన చేస్తున్న కొత్త సినిమా ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది. ఇది వీరిద్దరి తొలి కాంబినేషన్ కావడంతో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా జరిగిన ఫొటోషూట్‌లో రవితేజతో పాటు వివేక్ ఆత్రేయ, ప్రియాంక అరుళ్ మోహన్, మలయాళ నటి అనశ్వర రాజన్ పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన రవితేజ షాడో లుక్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే పాత్రలు, కథకు సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఈ సినిమాను బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ నిర్మించనుండగా, ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైటిల్ దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నప్పటికీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దసరా సందర్భంగా సినిమాను అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ హారర్ నేపథ్యంతో తెరకెక్కనుందని, మరికొన్ని కథనాలు హారర్-కామెడీ థ్రిల్లర్‌గా పేర్కొంటున్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా, అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని కూడా కీలక పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!