
రాజకీయాలు

రైలు బోగీలో పూజారి ఆధ్వర్యంలో మతపరమైన పూజలు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నార్తర్న్ రైల్వే దీనిపై అధికారికంగా స్పందించింది.
వైరల్ వీడియోలో కనిపిస్తున్నది సాధారణ ప్రయాణికుల కోచ్ కాదని, అది ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని నార్తర్న్ రైల్వే స్పష్టం చేసింది. రైల్వే నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా బుక్ చేసుకున్న సెలూన్ కోచ్‌లలో ప్రైవేట్ కార్యక్రమాలు, మతపరమైన వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!