
జనరల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కొత్త ప్రాజెక్ట్ ‘రాపో 23’పై టాలీవుడ్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చూపించేందుకు రామ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మొదట విలన్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ పేరును పరిశీలించిన చిత్రబృందం ప్రస్తుతం తమిళ నటుడు ఎస్.జె. సూర్యతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో-విలన్ మధ్య పోటీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని టాక్. మరోవైపు కథానాయికగా శ్రీనిధి శెట్టిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంగీత బాధ్యతలను సామ్ సీఎస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!