

టాలీవుడ్‌లో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పూజా హెగ్డే మరోసారి తెలుగు చిత్రసీమలో బిజీ కావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. వరుస అపజయాలు, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో కొంతకాలం తెలుగు సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు మళ్లీ కొత్త అవకాశాల కోసం సిద్ధమవుతోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘శ్రీశ్రీ’ చిత్రంలో నటిస్తున్న పూజాపై అభిమానుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆమెకు మరో ఆసక్తికరమైన టాలీవుడ్ ప్రాజెక్ట్ దక్కినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో మరోసారి స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని బలపరుచుకునే అవకాశం దక్కుతుందా అనే చర్చ మొదలైంది.
మాస్ రాజా రవితేజ, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ చిత్రంలో రవితేజ సరసన పూజా హెగ్డేను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ నిజమైతే తెరపై కొత్త తరహా జోడీని ప్రేక్షకులు చూడబోతున్నారు. రవితేజతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటికే అభిమానుల్లో మొదలైంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ అవకాశం ఖరారైతే పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో మరోసారి బలమైన పునరాగమనం లభించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!