
రాజకీయాలు

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలపై మరోసారి అనిశ్చితి నెలకొంది. ఈ సినిమాను తొలుత మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా ఆగస్టు 21కు వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ తేదీన కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 21న రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో, ది ప్యారడైజ్ చిత్రాన్ని డిసెంబర్‌కు వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇంకా సుమారు 60 రోజుల షూటింగ్ మిగిలి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు భారీ మొత్తానికి ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్, సినిమాను త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని సూచిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!