

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. తాత్కాలికంగా "NBK 111" పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, ఈ చిత్రంతో మరోసారి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిత్ర నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండగా, తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం.
ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ ముంబైలో జరగనున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాలతో పాటు కొన్ని ప్రత్యేక లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. షూటింగ్ కోసం బాలకృష్ణ ఇప్పటికే ముంబై చేరుకున్నారని, అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!