

అల్లు అర్జున్ తన రాబోయే సినిమాల్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నాడనే చర్చ టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత మరింత వైవిధ్యమైన కథలు, పాత్రలతో ముందుకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌పై ప్రత్యేకమైన బజ్ ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. తండ్రి, కొడుకుతో పాటు విలన్ పాత్రను కూడా ఆయనే పోషించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలకు చిత్రబృందం నుంచి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ చేయనున్నట్లు ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్‌పైనా ఆసక్తి పెరుగుతోంది. పవర్‌ఫుల్ పోలీస్ కథను తెరకెక్కించాలని తనకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉందని లోకేశ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో, AA23లో బన్నీ సీరియస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ గతంలో రేసుగుర్రం సినిమాలో కొద్దిసేపు పోలీస్ పాత్రలో కనిపించినప్పటికీ, పూర్తి స్థాయి సీరియస్ పోలీస్ క్యారెక్టర్ చేయలేదు. ఈ వార్తలు నిజమైతే ఆయన కెరీర్‌లో మరో కొత్త కోణాన్ని చూపించే అవకాశం ఉంటుంది. అయితే లోకేశ్ అసలు ప్లాన్ ఏమిటనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!