

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా వినిపిస్తున్న ఇండస్ట్రీ బజ్ మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తండ్రి, కొడుకు పాత్రలను బాలయ్యే పోషించనున్నారని, కథలో ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలను చూపించే సన్నివేశాలు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమాలో సామాజిక అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. బాలకృష్ణ కోసం ప్రత్యేకమైన మేకోవర్‌ను సిద్ధం చేస్తున్నట్లు, నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో తొలి షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పూర్తి నిర్మాణ ప్రణాళిక ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కొరటాల శివ మార్క్ సామాజిక అంశాలకు బాలయ్య మాస్ ఇమేజ్, తండ్రీకొడుకుల ఎమోషన్ జోడిస్తే సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!