

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల “విరోష్” పెళ్లి వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 న ఈ జంట ఉదయ్‌పూర్‌కు చేరుకోగా, ఈ నెల 26 న జరగనున్న తమ సన్నిహిత వివాహ వేడుక కోసం అరవల్లి కొండల్లోని అతి విలాసవంతమైన మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ — ఏకాయా ఉదయ్‌పూర్ రిసార్ట్‌ను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 117 ప్రైవేట్ విల్లాలతో ఉన్న ఈ రిసార్ట్ పెళ్లి తేదీలకు పూర్తిగా బుక్ అయిందని సమాచారం. ప్రీమియం సూట్ల ధరలు పన్నులతో కలిపి ఒక్క రాత్రికి సుమారు ₹91,000 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
పెళ్లిని పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించేందుకు అతిథుల సంఖ్యను సుమారు 100 మందికే పరిమితం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మరియు కొందరు ప్రముఖులకే ఆహ్వానం అందించగా, వేడుకలో కఠినమైన ‘నో-ఫోన్ పాలసీ’ అమలు చేయనున్నారు. ఉదయ్‌పూర్‌లోని ప్రైవేట్ వివాహం అనంతరం వచ్చే నెల 4 న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!