
జనరల్

నటుడు సూర్య ఇటీవల కరుప్పు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళ దర్శకుడు జీతు మాధవన్తో తన 47వ సినిమాను ప్రకటించారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా దర్శకుడు టి.జె. జ్ఞానవేల్తో మరో సినిమా చేయనున్నారు.
ఇదిలా ఉండగా, సూర్య తన 49వ సినిమాగా దర్శకుడు హెచ్. వినోద్తో కలిసి పనిచేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయ్ హీరోగా చేసిన జన నాయగన్ సినిమాను పూర్తి చేసిన హెచ్ వినోద్, సూర్యకు కొత్త కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ సెట్ అయితే భారీ అంచనాలు నెలకొననున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!