

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత చరణ్ తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ చర్చ నడుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌లో సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతారా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
సుకుమార్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన జోడీలలో ఒకటిగా నిలిచింది. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు వీరి కాంబినేషన్ ఎన్నో బ్లాక్‌బస్టర్లకు కారణమైంది. అయితే ‘పుష్ప-2’ సమయంలో కొన్ని క్రియేటివ్ భేదాభిప్రాయాలు వచ్చాయన్న వార్తలు ఈ బంధంపై కొత్త చర్చకు దారితీశాయి.
ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండటంతో ఆయన మ్యూజిక్ కెరీర్‌పై ఫోకస్ తగ్గుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చరణ్–సుకుమార్ సినిమా ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉండటంతో అధికారిక నిర్ణయం రాలేదు. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!