

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా పాల్గొననున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథలో అత్యంత కీలకమైన సన్నివేశాలను జైలు నేపథ్యంలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. హై వోల్టేజ్ యాక్షన్, ఇంటెన్స్ డ్రామాతో కూడిన ఈ ఎపిసోడ్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ మేకింగ్‌తో పాటు ప్రభాస్ పోలీస్ పాత్ర ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!