
రాజకీయాలు

భారత రక్షణ శక్తికి కీలకమైన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి మందగించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లో నూతన తరం బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి ఇంకా కేంద్ర ప్రభుత్వం పూర్తి అనుమతి ఇవ్వకపోయినా, హైదరాబాద్ మరియు నాగపూర్ కేంద్రాల నుంచి సీనియర్ సిబ్బందిని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కేంద్రాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అనుభవజ్ఞులైన సిబ్బంది బదిలీల కారణంగా క్షిపణి అసెంబ్లీ, వ్యవస్థల అనుసంధానం వంటి కీలక విభాగాల్లో సిబ్బంది కొరత ఏర్పడి ఉత్పత్తి తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత నౌకాదళం ఇప్పటికే 220 బ్రహ్మోస్ క్షిపణులకు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఉత్పత్తి మందగిస్తే సరఫరాలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఇది దేశ రక్షణ సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!