

రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం రామాయణ గురించి మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ముందుగా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ట్రైలర్‌ను జూలై 30న డిజిటల్ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈ వార్తతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. ట్రైలర్ విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తోడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న లీక్ విజువల్స్ సినిమాపై మరింత చర్చకు దారితీశాయి.
ఇటీవల జరిగిన కామిక్ కాన్ కార్యక్రమంలో ప్రదర్శించిన ట్రైలర్‌లోని కొన్ని దృశ్యాలు బయటకు రావడం చర్చనీయాంశమైంది. తాజాగా మరికొన్ని విజువల్స్ కూడా లీక్ కావడంతో అవి వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విజువల్ నాణ్యత, గ్రాఫిక్స్, యుద్ధ సన్నివేశాల రూపకల్పన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారనే అభిప్రాయం మరింత బలపడుతోంది. సంగీత దిగ్గజాలు హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ కలిసి సంగీతం అందిస్తుండటం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలకు ముందే దేశవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!