
.webp&w=3840&q=75)
వచ్చే ఏడాది స్టార్ హీరోల సందడి గట్టిగానే ఉంది. ప్రభాస్ నుంచి ఆల్రెడీ 2 సినిమాలు లాక్ అయ్యాయి. ఇప్పుడు చిరంజీవి వంతు. చిరంజీవి నుంచి కూడా వచ్చే ఏడాది 2 సినిమాలు పక్కాగా రాబోతున్నాయి. పక్కాగా షెడ్యూల్స్ కుదిరితే చిరంజీవి నుంచి మూడో చిత్రం కూడా వచ్చే అవకాశాలున్నాయి. సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా రాబోతోంది. ఈ మూవీకి ఇంకా డేట్ లాక్ చేయలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, జనవరి 12న చిరు సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే తదుపరి అప్ డేట్ ఇదే.
ఇక వచ్చే ఏడాది సమ్మర్ కు విశ్వంభర సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఇదివరకే ప్రకటించారు. అయితే ఇక్కడ కూడా డేట్ లాక్ చేయలేదు. రావడం మాత్రం పక్కా. నిజానికి చిరంజీవి నుంచి వచ్చే ఏడాది మరో సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, విశ్వంభర షూట్ ఆల్రెడీ పూర్తయింది. మరో నెల రోజుల్లో అనీల్ రావిపూడి సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. సో.. వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త సినిమా మొదలుపెడితే, దసరా లేదా దీపావళి నాటికి చిరు మరో సినిమా రెడీ చేసేయొచ్చు. మరి అలా జరుగుతుందా? చిరంజీవి నుంచి ఒకే ఏడాది 3 సినిమాలు వస్తాయా?











కామెంట్స్ (1)
Three films in one year? That’s insane!