

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్‌లో కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. తాజాగా వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో కూడా చురుకుగా పాల్గొని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
అయితే జూన్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి వీకెండ్‌లోనే కలెక్షన్లు నిరాశపరిచాయని, వీక్‌డేస్‌లో వసూళ్లు మరింత తగ్గినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం కమర్షియల్ విజయాన్ని అందుకోవడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డేకు మరోసారి నిరాశ ఎదురైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన మృణాల్ ఠాకూర్‌కూ ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!