

విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47’. తాజాగా ఈ సినిమాలో వెంకటేశ్ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో వెంకీ మామ ‘చిట్టిబాబు’ పాత్రలో సందడి చేయనున్నారు. ఆయనకు జోడీగా శ్రీనిధి శెట్టి కనిపించనుండగా, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47’ అక్టోబర్ 2న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిట్టిబాబుగా వెంకటేశ్ తనదైన వినోదంతో ఆకట్టుకోనున్నట్లు తాజా పాత్ర పరిచయ వీడియో ద్వారా చిత్రబృందం వెల్లడించింది. కుటుంబ భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నారా రోహిత్ పాత్ర కూడా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!