

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది. 2024 సంక్రాంతికి విడుదలైన తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మేకర్స్ అధికారికంగా ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రకటించడమే కాకుండా షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా చిత్రంలో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమాపై మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే రిషబ్ శెట్టి, రానా దగ్గుబాటి ఒకే తెరపై కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!