
జనరల్

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన తొలి పాటకు మంచి స్పందన లభించగా, ఇప్పుడు రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం, జూలై 29న ఈ సినిమా రెండో సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!