

బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న సీనియర్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే గోపీచంద్‌మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బాలయ్య, తాజాగా కొరటాల శివ తో మరో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో దర్శకుడు వివేక్ఆత్రేయ తో బాలయ్య సినిమా చేయనున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపాయి.
ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్న ప్రచారం నిజం కాదని సమాచారం. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు సరిపోయేలా పూర్తి స్థాయి కమర్షియల్ కథను వివేక్ ఆత్రేయ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో డ్యూయల్ రోల్స్ ఉండే అవకాశముందని, రెండు పాత్రల్లోనూ బాలయ్య కనిపించాలా లేదా మరో స్టార్ నటుడిని తీసుకురావాలా అనే అంశాలపై చర్చ జరుగుతోందట. స్క్రిప్ట్ పూర్తయ్యాక ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. బ్రోచేవారెవరురా, అంటేసుందరానికి, సరిపోదాశనివారం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ – బాలయ్య కాంబోపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!