

భారతీయ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ ఎపిక్ ‘రామాయణ’ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఈ మహత్తర ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రహమాన్ మరియు హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జీమర్అందించబోతున్నవారు. ఈ కలయికే సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. సమాచారం ప్రకారం, ఈ చిత్రం రూ.4000 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో మూడు భాగాలుగా రూపొందనుంది.
తాజా అప్డేట్ ప్రకారం, సౌత్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆయన రావణుడి తమ్ముడు విభీషణుడు పాత్రలో కనిపించనున్నారు. ఇది ఒక సాధారణ పాత్ర కాకుండా ధర్మం, కుటుంబ బంధాలు, న్యాయం మధ్య నలిగిపోయే గంభీరమైన పాత్ర. రావణుడు అధర్మ మార్గంలో నడుస్తున్నాడని తెలుసుకుని రాముడికి అండగా నిలబడే విభీషణుడి పాత్రకు విజయ్ సేతుపతి సరైన ఎంపికగా దర్శకుడు భావించారు.
రావణుడిగా యష్ నటిస్తుండటంతో, యష్ మరియు విజయ్ సేతుపతి మధ్య వచ్చే అన్నదమ్ముల ఘర్షణ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. రెండో, మూడో భాగాల్లో విభీషణుడి పాత్ర కీలకమైందిగా ఉండనుందని తెలిసింది. విజయ్ సేతుపతి సహజ నటన, భావోద్వేగ లోతు ఈ పాత్రకు మరింత బలాన్ని తెస్తాయని టీమ్ నమ్మకం వ్యక్తం చేసింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!