

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పలు ప్రచారాలు సాగాయి. ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. “ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి” అని పేర్కొంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లను ట్యాగ్ చేశారు. దీంతో సినిమాకు సంబంధించిన తాజా వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి.
తాత్కాలికంగా AA 23గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, తనదైన యాక్షన్ కథనాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన లోకేష్ కనగరాజ్ కలిసి పనిచేయడం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన ఫొటోలో ఇద్దరూ చర్చిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, కథ లేదా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మేకర్స్ నుంచి వచ్చే తదుపరి ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!