
జనరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించగా, భారీ బడ్జెట్ సినిమాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లకు ఆయన తొలి ఎంపికగా మారారు. అందుకే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్‌ను సంప్రదించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆదిత్య ధర్, ‘ధురంధర్’ సిరీస్ విజయాలతో మరింత క్రేజ్ సంపాదించారు. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభాస్-ఆదిత్య ధర్ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!