
క్రీడలు

'NBK 111' సినిమా టీజర్‌ను జూన్ 10న, నటుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది గోపీచంద్ మలినేని కాగా, కథానాయికగా కాజల్ అగర్వాల్ నటించనున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షూటింగ్ షెడ్యూల్ జూన్ 7 నుంచి ముంబైలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. గత కాంబినేషన్ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!