
క్రీడలు

విలువిద్య క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్ ప్రపంచ కప్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి గౌరవం తీసుకురావడం ఆనందంగా ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు.
ఒకే రోజు రెండు స్వర్ణ పతకాలు, అందులోనూ మిశ్ర ద్వంద్వ విభాగం టైటిల్ గెలుచుకోవడం అసాధారణ విజయమని జగన్ కొనియాడారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశానికి గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!