
జనరల్

బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా బిహార్ షరీఫ్‌కు చెందిన జగదీప్ నారాయణ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే అతి చిన్న పెన్నును సేకరించి భద్రపరిచినందుకు ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ ఇత్తడి పెన్ను పొడవు కేవలం 3 అంగుళాలు మాత్రమే ఉండటం విశేషం.
జగదీప్ నారాయణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ ప్రత్యేక పెన్నును సుమారు 34 సంవత్సరాల క్రితం కేవలం రూ.20కు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, తన సేకరణలో రూ.3కు కొనుగోలు చేసిన మరో చిన్న పెన్ను కూడా ఉందని వెల్లడించారు. అరుదైన వస్తువుల సేకరణపై తనకున్న ఆసక్తే ఈ ఘనత సాధించడానికి కారణమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!