
రాజకీయాలు

ఓ గురుగ్రామ్‌కు చెందిన “స్టార్విక్ డిజైన్” కంపెనీలో పనిచేసే హిమాన్షు జంగ్ర అనే ఉద్యోగి ఒక కామెడీ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. డేటింగ్ గురించి మాట్లాడుతూ అతడు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వివాదం పెరగడంతో అతడు క్షమాపణ చెప్పి తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేశాడు. అయినప్పటికీ రచ్చ ఆగకపోవడంతో విషయం కంపెనీ యాజమాన్యానికి చేరింది. అంతర్గత విచారణ అనంతరం కంపెనీ సీఈఓ వివేక్ విశ్వకర్మ అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!