31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ కాలుష్యంపై కఠిన ఆంక్షలు.. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ పనులపై నిషేధం!

Writer: Harika S 11:11 AM, 31 అక్టోబర్, 2026
ఢిల్లీ కాలుష్యంపై కఠిన ఆంక్షలు.. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ పనులపై నిషేధం!

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శీతాకాలం ప్రారంభం కావడంతో వాయు కాలుష్యం మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణించే ప్రమాదం ఉండటంతో కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ముందస్తు చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. నవంబర్‌ 5 నుంచి 20 వరకు ఢిల్లీ, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, సోనిపట్‌, ఘాజియాబాద్‌, గౌతమ్‌ బుద్ధ నగర్‌ (నోయిడా) జిల్లాల్లో కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలి. మిగిలిన సిబ్బంది ఇంటి నుంచే పనిచేసేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలి. అత్యవసర సేవలు, నిరంతరం పనిచేయాల్సిన పరిశ్రమలకు మినహాయింపులు ఉంటాయని సమాచారం.

కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన దుమ్ము, ధూళిని నియంత్రించేందుకు ఎన్‌సీఆర్‌ పరిధిలో నిర్మాణ, కూల్చివేత పనులపై కూడా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. హైవేలు, రహదారులు, ఫ్లైఓవర్లు, విద్యుత్‌ లైన్లు, పైప్‌లైన్ల వంటి బహిరంగ నిర్మాణ పనులను నవంబర్‌ 20 వరకు నిలిపివేయనున్నారు. అయితే రైల్వేలు, మెట్రో సేవలు, విమానాశ్రయాలు, బస్‌ టెర్మినళ్లు, ఆసుపత్రులు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, జాతీయ భద్రత, రక్షణకు సంబంధించిన అత్యవసర ప్రాజెక్టులకు మినహాయింపులు ఉంటాయి. గత కొన్నేళ్లుగా నవంబర్‌లో కాలుష్యం తీవ్రత పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పంట వ్యర్థాల దహనం, దీపావళి తర్వాత వెలువడే ఉద్గారాలు, వాహనాల పొగ, గాలి వేగం తగ్గడం, తేమ పెరగడం వంటి కారణాలతో కాలుష్య కణాలు వాతావరణంలో ఎక్కువసేపు నిలిచిపోతున్నాయి. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరకుండా నివారించడమే ఈ ముందస్తు ఆంక్షల ప్రధాన ఉద్దేశం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్‌!

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్‌!

ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా.. రెండోసారి రూ.10 వేలు!

ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపితే రూ.5 వేల జరిమానా.. రెండోసారి రూ.10 వేలు!

మక్కా సమీపంలో డ్రోన్ కలకలం..

మక్కా సమీపంలో డ్రోన్ కలకలం..

2027 జనగణన షెడ్యూల్ విడుదల..

2027 జనగణన షెడ్యూల్ విడుదల..

ఇజ్రాయెల్ ఎన్నికల్లో అరబ్ పార్టీల చారిత్రక విజయం.. 19 స్థానాలు కైవసం

ఇజ్రాయెల్ ఎన్నికల్లో అరబ్ పార్టీల చారిత్రక విజయం.. 19 స్థానాలు కైవసం

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు

ట్యాగ్లు
ఢిల్లీ వాయు కాలుష్యంసీఏక్యూఎంవర్క్ ఫ్రమ్ హోమ్ఢిల్లీ ఎన్‌సీఆర్నిర్మాణ పనుల నిషేధంగాలి నాణ్యత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా త్రిగుణ్.. సుధీర్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడిన ఝాన్సీ!
షోస్

బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా త్రిగుణ్.. సుధీర్‌ను ఎలిమినేషన్ నుంచి కాపాడిన ఝాన్సీ!

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !
రాజకీయాలు

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

బిగ్‌బాస్ 10: ఓటింగ్‌లో టాప్‌లో వంశీ, రోహిత్.. ఎలిమినేషన్‌ డేంజర్‌లో ఆ నలుగురు!
షోస్

బిగ్‌బాస్ 10: ఓటింగ్‌లో టాప్‌లో వంశీ, రోహిత్.. ఎలిమినేషన్‌ డేంజర్‌లో ఆ నలుగురు!

RC17లో రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి?
గాసిప్స్

RC17లో రామ్ చరణ్ సరసన సాత్విక వీరవల్లి?

దీపావళి కానుకగా బాలకృష్ణ ‘దాదా’ ఫస్ట్ సింగిల్?
గాసిప్స్

దీపావళి కానుకగా బాలకృష్ణ ‘దాదా’ ఫస్ట్ సింగిల్?

మైనర్‌తో షూటింగ్, ప్రమోషన్లు.. ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు!
సినిమాలు

మైనర్‌తో షూటింగ్, ప్రమోషన్లు.. ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు!

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్‌!
జనరల్

ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్‌!

దిల్జీత్‌ దోసాంజ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ దీప్కే
సినిమాలు

దిల్జీత్‌ దోసాంజ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ దీప్కే

ఢిల్లీ కాలుష్యంపై కఠిన ఆంక్షలు.. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ పనులపై నిషేధం!
జనరల్

ఢిల్లీ కాలుష్యంపై కఠిన ఆంక్షలు.. 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, నిర్మాణ పనులపై నిషేధం!

జాన్వీపై తెలుగు ఫ్యాన్స్ ఫైర్?
సినిమాలు

జాన్వీపై తెలుగు ఫ్యాన్స్ ఫైర్?

100 మంది జానపద కళాకారులతో DSP సంచలనం!
సినిమాలు

100 మంది జానపద కళాకారులతో DSP సంచలనం!

దూసుకుపోతున్న కోదండరామిరెడ్డి తనయుడు!
సినిమాలు

దూసుకుపోతున్న కోదండరామిరెడ్డి తనయుడు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!