

బాలీవుడ్‌లో కొందరు నటీనటులు తమ సినిమాల కంటే ప్రచారంతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. కానీ శ్రద్ధా కపూర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఆమె నటించిన సినిమాలతో పలువురు హీరోలకు కూడా మంచి విజయాలు దక్కడం విశేషం. ఆదిత్య రాయ్ కపూర్‌కు 'ఆషికీ 2', సిద్ధార్థ్ మల్హోత్రాకు 'ఏక్ విలన్', రాజ్‌కుమార్ రావుకు 'స్త్రీ', 'స్త్రీ 2', వరుణ్ ధావన్‌కు 'ఏబీసీడీ 2', టైగర్ ష్రాఫ్‌కు 'బాఘీ', అర్జున్ కపూర్‌కు 'హాఫ్ గర్ల్‌ఫ్రెండ్' వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇలా పలు విజయవంతమైన సినిమాల్లో భాగమైన శ్రద్ధా.. తన ప్రచారాన్ని మాత్రం ఎప్పుడూ హద్దుల్లోనే ఉంచుతారనే అభిప్రాయం ఉంది.
ఇక ఇప్పుడు మరోసారి కథానాయికగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న ఈత సినిమాలో ఆమె నటిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగమైనప్పటికీ, సోలో హీరోయిన్‌గా తన మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని అభిమానులు భావిస్తున్నారు. భారీ ప్రచార హడావుడి లేకుండానే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం శ్రద్ధా ప్రత్యేకతగా చెబుతున్నారు. ఇప్పుడు ఈత ద్వారా మరోసారి తనలోని నటనకు పదును పెట్టే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. తక్కువ హడావుడితో ఎక్కువ ప్రభావం చూపించే నటిగా శ్రద్ధాకు మరింత గుర్తింపు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!