

టాలీవుడ్ దిగ్గజ నటుడు, మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న ‘మెగావర్స్’ అనే సరికొత్త టాక్ షోతో ఆయన డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంపై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా, ఈ షోకు సంబంధించిన రెండు ఎపిసోడ్‌ల షూటింగ్ కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే, ‘మెగావర్స్’ తొలి ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్‌కు వస్తుందనే విషయంపై తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ మొదటి వారాంతంలో మొదటి ఎపిసోడ్‌ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగాస్టార్‌ను కొత్త టాక్ షో ఫార్మాట్‌లో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే స్ట్రీమింగ్ తేదీపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!