
రాజకీయాలు

ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో రాహు కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన శ్రీకాళహస్తి ఆలయంలో ఉపాసన ప్రత్యేక పూజలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఆలయ దర్శనంతో ఉపాసన ఆధ్యాత్మికంగా గడిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!