

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ రికార్డింగ్ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ పాటను ప్రత్యేకంగా రూపొందించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంగీత కళాకారులను ఒకచోట చేర్చారు. ఏకంగా 100 మంది జానపద రిథమ్ కళాకారులతో ఈ పాటను రికార్డ్ చేయడం విశేషం. భిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన సంగీత శైలులను ఒకే పాటలో కలిపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.
మరోవైపు ఈ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా టైటిల్ సాంగ్ రికార్డింగ్ పూర్తవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. త్వరలోనే ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!