

తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఈసారి ఆయన కాన్వాయ్‌లో కనిపిస్తున్న “0277” నంబర్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. విజయ్ వాడుతున్న బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు, లెక్సస్ ఎల్ఎమ్, టయోటా వెల్‌ఫైర్‌తో పాటు ప్రచార వాహనానికి కూడా ఇదే నంబర్ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట ఇది సాధారణ ఫ్యాన్సీ నంబర్ అనుకున్నప్పటికీ, దీని వెనుక ఉన్న భావోద్వేగ కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.
విజయ్ చిన్న వయసులోనే మరణించిన తన సోదరి విద్య జ్ఞాపకార్థంగా ఈ నంబర్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఆమె పుట్టిన నెల ఫిబ్రవరిలోని “02”, పుట్టిన సంవత్సరం 1977లోని “77” కలిపి “0277”గా మార్చారని తెలుస్తోంది. ప్రతి ప్రయాణంలోనూ తన చెల్లెలి జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో విజయ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!