

టీమ్ఇండియా క్రికెటర్ రింకు సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 4న ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో వీరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్లు సమాచారం. క్రికెట్, బాలీవుడ్, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. ప్రియ సరోజ్ ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. రింకు సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా వివాహానికి ఆహ్వానించనున్నట్లు సమాచారం.
ప్రియ సరోజ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో మచిలీషహర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఆర్ట్స్‌తో పాటు న్యాయశాస్త్రంలోనూ డిగ్రీలు పూర్తి చేశారు. రింకు సింగ్, ప్రియ సరోజ్‌ల నిశ్చితార్థం గతేడాది జూన్‌లో జరిగింది. ఇప్పుడు డిసెంబర్ 4న వీరి వివాహం జరగనుండటంతో ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వివాహ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!