

అమెరికాలో క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఐఫోస్ఫామైడ్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (USFDA) భారతదేశాన్ని ఆశ్రయించింది. ఊపిరితిత్తులు, వృషణాలు, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో కీలకంగా ఉపయోగించే ఈ ఔషధాన్ని అత్యవసరంగా సరఫరా చేయాలని భారత ఔషధ తయారీదారుల సంఘం (IDMA)ను కోరింది. ఈ పరిణామం భారతీయ ఫార్మా రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను తెరుచుకోనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
బాక్స్టర్ ఇంటర్నేషనల్‌కు చెందిన కాంట్రాక్ట్ తయారీ కేంద్రంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం ఈ కొరతకు ప్రధాన కారణంగా మారింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతింది. దీంతో 2026 చివరి వరకు కొరత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. సిప్లా, జైడస్, ఆల్కెమ్, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, ఇప్కా ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా వంటి భారతీయ సంస్థలు ఈ అవకాశంతో లాభపడే అవకాశం ఉంది. కొరత తీవ్రతను దృష్టిలో ఉంచుకుని యూఎస్‌ఎఫ్‌డీఏ కొన్ని నియంత్రణ నిబంధనలకు సడలింపులు ప్రకటించడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!