

విద్యార్థుల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. ఈ సదుపాయం కింద బాలురు ఇంటర్మీడియట్ వరకు, బాలికలు డిగ్రీ వరకు ప్యాసింజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ఈ వెసులుబాటు కేవలం సెకండ్ క్లాస్ కోచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. విద్యార్థులు నివసించే ప్రాంతం నుంచి విద్యాసంస్థ వరకు 150 కిలోమీటర్ల లోపు దూరానికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఈ రాయితీ పొందాలనుకునే విద్యార్థులు తమ గుర్తింపు కార్డు, ఫొటోను సమర్పించి రైల్వే కౌంటర్లో మంత్లీ సీజన్ టికెట్ (MST) తీసుకోవాలి. సాధారణ విద్యా ప్రయాణాలతో పాటు విద్యా పర్యటనలకు వెళ్లే విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా రైల్వే శాఖ టికెట్ ధరల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. ఈ సదుపాయాల ద్వారా విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించి, విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!