

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన సివిల్ దావా విచారణలో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, రా మాజీ చీఫ్ సామంత్ గోయెల్‌కు సమన్లు అందజేయాలని తన సిబ్బందిని ఆదేశించింది. ఈ నెల 13న జారీ చేసిన ఉత్తర్వుల్లో న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి కేథరిన్ పొలాక్ ఫిల్లా.. భారత్‌లోని సంబంధిత న్యాయస్థానాలు ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు. దిల్లీలోని పాటియాలా హౌస్ జిల్లా కోర్టు ద్వారా డోభాల్‌కు, తీస్ హజారీ జిల్లా కోర్టుల ద్వారా సామంత్ గోయెల్‌కు సమన్లు, సంబంధిత కోర్టు పత్రాలు అందజేయాలని సూచించారు.
హేగ్ ఒప్పందం, భారత సివిల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనల ప్రకారం విదేశీ న్యాయస్థానాలు ఈ తరహా సమన్లు జారీ చేయవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. తనను హతమార్చేందుకు భారత అధికారులు కుట్ర పన్నారంటూ పన్నూ ఈ సివిల్ దావాలో ఆరోపణలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. డోభాల్, సామంత్ గోయెల్‌పై పన్నూ చేసిన ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని, పూర్తిగా అవాస్తవమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!