

రామ్ చరణ్ భార్య, ఉపాసన కొణిదెల పేరెంటింగ్‌లో కనిపిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల సంరక్షణలో తండ్రులు చిన్న చిన్న బాధ్యతలు నిర్వర్తించినా ప్రశంసలు అందుకుంటుండగా, తల్లులు మాత్రం అవే పనులను ఎలాంటి గుర్తింపు లేకుండా చేయాల్సి వస్తోందని ఆమె ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌తో మాట్లాడిన సందర్భంగా ఉపాసన ఈ అభిప్రాయాలను వెల్లడించారు.
పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి సమాన బాధ్యత అని ఉపాసన స్పష్టం చేశారు. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలని సూచించారు. కుటుంబంలోనే సమానత్వ భావన, ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా కార్యాలయాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం లభిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజంలో లింగ సమానత్వం సాధించాలంటే ముందుగా ఇళ్లలో మార్పు ప్రారంభం కావాలని ఆమె పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!