

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లోపాలను చూపించే వీడియోలను చిత్రీకరించి ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో ఓ సోషల్ మీడియా జర్నలిస్టుతో పాటు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఘాజియాబాద్, గౌతమ్‌బుద్ధ్‌నగర్, హర్దోయి, హాథ్రస్, మీరట్, లక్నో, అమేథీ, సిద్ధార్థ్‌నగర్ జిల్లాల్లో కనీసం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అంతకుముందు డియోరియాలో యువ కార్యకర్త రజత్ సింగ్‌పై కూడా కేసు నమోదైంది.
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన “నకిలీ”, “తప్పుదోవ పట్టించే” వీడియోలను ప్రచారం చేస్తూ రాష్ట్రంలో వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 22న ఉన్నతాధికారులను ఆదేశించిన తర్వాత ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో పలు జిల్లాల్లో అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు, ముఖ్యంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా వినియోగదారుల ప్రవేశాన్ని నిషేధించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!