
జనరల్

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రయత్నించగా, తెలంగాణ ఇంజినీర్లు అడ్డుకున్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. దీంతో కుడికాల్వకు నేరుగా నీటిని విడుదల చేయడానికి బదులుగా విద్యుదుత్పత్తి ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఏపీ చర్యలు చేపట్టింది.
ఏపీ 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తెలంగాణ కూడా ఎడమ కాల్వకు అదే స్థాయిలో నీటిని విడుదల చేసింది. అయితే, నీటి విడుదలకు సంబంధించి కేఆర్‌ఎంబీ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకముందే ఏపీ నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించడం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదానికి దారితీసింది. నాగార్జునసాగర్ నీటి పంపకాల అంశం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!