

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ కూడా బిగ్‌బాస్ 10లోకి అడుగుపెట్టనున్నట్లు టీవీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగులో పెద్దగా మాట్లాడలేకపోయినా, తన నటనతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇక బిగ్‌బాస్ 10లో పాల్గొనేందుకు దేబ్జానీ మోదక్ వారానికి సుమారు రూ.4 లక్షల పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరణ కాలేదు. ఆమెతో పాటు ముఖేష్ గౌడ, రక్షిత, పల్లవి గౌడ, జబర్దస్త్ నూకరాజు, వర్ష, పవిత్ర, ఫోక్ డ్యాన్సర్లు మాధురి రాథోడ్–ఈశ్వర సాయి, ఆటో రామ్ ప్రసాద్, యాంకర్ వర్షిణి, టెంపర్ వంశీ తదితరుల పేర్లు కూడా కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!