
జనరల్

కేంద్ర కేబినెట్ నేడు మధ్యాహ్నం 1 గంటకు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన డీలిమిటేషన్ బిల్లుపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఈ రెండు బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలు కావడంతో కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!