

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. నవంబర్ 28వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు ఈ తేదీలను గుర్తుంచుకుని టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం డిసెంబర్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ విధానం ద్వారా టోకెన్లను కేటాయించనున్నారు. దాతల దర్శన కోటా టికెట్లను డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించే ఉద్దేశంతో డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ రెండు రోజులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసింది. ఈ తేదీల్లో దర్శనం కోసం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!