
జనరల్

అసోంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్ జవాన్ కదిమి వేణు మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన వేణు దేశ సేవలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన కదిమి వేణుకు నివాళులర్పిస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వేణు కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!